కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించాలి: మాధవ్

ABN , First Publish Date - 2020-09-24T00:31:38+05:30 IST

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా ఖండించారు. ‘మోదీ, యోగి

కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించాలి: మాధవ్

విజయవాడ: ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా ఖండించారు. ‘మోదీ, యోగి ఆదిత్యలపై మదం ఎక్కి మాట్లాడుతున్నారు. మంత్రిని కదా అని నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదు. ఆంజనేయ స్వామి విగ్రహం, రథం దగ్ధం, అమ్మవారి వెండి సింహాలపై చేసిన వ్యాఖ్యలతో ప్రజలు తిడుతున్నారు. ప్రధాని మోదీ, యోగి ఆదిత్యల జీవితాల గురించి కొడాలి నానికి ఏం తెలుసు. నిన్నటి వరకు మంత్రిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. ఈరోజు చేసిన వ్యాఖ్యలతో కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నానిని తొలగించాలంటూ ఆందోళనలు చేపడతాం. మోదీ, యోగి ఆదిత్య ‌జీవన శైలి తెలుసు కోవాలి. వారి సతీమణి గురించి మాట్లాడటానికి మంత్రికి సిగ్గుండాలి. తిరుమలలో ఉన్న నాని... అక్కడ ఉన్న వెంకన్న రాయా, బొమ్మా, దేవుడా చెప్పాలి. ప్రభుత్వం కూడా స్పందించి నానిపై చర్యలు తీసుకోవాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన హిందూ‌వాదులపై కేసులు కూడా ఎత్తివేయాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదంటే... ఆయనపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కనీసం ఖండించక పోగా.. అవహేళనతో మాట్లాడుతున్నారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించే వరకు మా పోరాటం కొనసాగిస్తాం’ అని మాధవ్ తెలిపారు.

Updated Date - 2020-09-24T00:31:38+05:30 IST