టీడీపీ, వైసీపీపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు

ABN , First Publish Date - 2020-08-06T23:40:57+05:30 IST

టీడీపీ, వైసీపీపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు గుప్పించారు. ‘రాజధాని పేరుతో గత ప్రభుత్వం రాక్షస క్రీడా ఆడింది. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది

టీడీపీ, వైసీపీపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు

విశాఖ: టీడీపీ, వైసీపీపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు గుప్పించారు. ‘రాజధాని పేరుతో గత ప్రభుత్వం రాక్షస క్రీడా ఆడింది. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఇందులో బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీల స్వార్థ రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. రెండు పార్టీలు సవాలు విసరడం కాదు. రాజధాని కోసం ఒక రాజీ పద్ధతికి రండి. అమరావతి క్యాపిటల్‌గా ఉండాలి. దీనికి బీజేపీ కట్టుబడి ఉంది. అమరావతికి భూములు ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప చంద్రబాబుకి కాదు. దాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలి. కేంద్రానికి రాష్ట్ర రాజధాని విషయంలో భూమిక లేదు. అన్ని ప్రాంతాల బీజేపీ నాయకులు రాజధాని విషయంలో ఓకే మాట చెబుతున్నారు. గతంలో అమరావతిని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. ఇప్పుడు ఎవరి కోసం విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగినప్పుడే విశాఖ ఆర్థిక రాజధానిగా అవతరించింది. వ్యాపార ప్రయోజనాలు కోసమే విశాఖను పరిపాలన రాజధాని చేయాలి అనుకుంటున్నారు. విశాఖలో ఉన్న విలువైన భూములు కోసం తప్పితే మరి ఏం కాదు.. రాజధాని కోసం ఉద్యమాలు చేస్తున్న రైతుల దృష్టి మళ్లించటానికి బీజేపీ పార్టీపై తప్పు నెడుతున్నారు’. అని మాధవ్ మండిపడ్డారు.

Updated Date - 2020-08-06T23:40:57+05:30 IST