బీజేపీ రాజ్యసభ సభ్యుడు సోలంకికి కరోనా

ABN , First Publish Date - 2020-08-14T12:08:15+05:30 IST

బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుమేర్ సింగ్ సోలంకికి కొవిడ్ -19 సోకింది.....

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సోలంకికి కరోనా

భోపాల్ (మధ్యప్రదేశ్): బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుమేర్ సింగ్ సోలంకికి కొవిడ్ -19 సోకింది. ఎంపీ సోలంకీకి గత కొన్ని రోజులుగా జ్వరం వస్తుండటంతో అతన్ని పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చిందని బర్వానీ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనితా సింగారే చెప్పారు. ఎంపీ సోలంకికి కరోనా సోకడంతో కరోనా సోకిన ఎంపీల సంఖ్య 2కు చేరింది. జూన్ నెలలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సోలంకి, జ్యోతిరాదిత్య సింథియాలకు కరోనా వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ముగ్గురు మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. 

Updated Date - 2020-08-14T12:08:15+05:30 IST