Abn logo
Sep 20 2021 @ 20:47PM

బెంగాల్ బీజేపీ చీఫ్‌పై వేటు..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీలో పెద్ద మార్చు చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర యూనిట్ అధినేతగా దిలీప్ ఘో‌ష్‌ను తప్పించి ఎంపీ సుకంత మజుందర్‌ను నియమించారు. రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికి భారతీయ జనతా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టీఎంసీలో చేరారు. అయితే బీజేపీ నేతలు పార్టీ వీడడంపై దిలీప్ ‌ఘోష్‌పై పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనే అధ్యక్షుడిగా కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అధ్యక్షుడిని మార్చినట్లు తెలుస్తోంది. కాగా, దిలీప్ ఘోష్ మార్పుపై ముందు నుంచే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఈ స్థానంలోకి సువేందు అధికారిని నియమిస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్ష నేతగా ఉన్నగా సువేందును కాకుండా ఎంపీ సుకంత మజుందర్‌ వైపు అధిష్టానం మొగ్గు చూపింది.