కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేసిన బీజేపీ

ABN , First Publish Date - 2021-10-19T15:14:10+05:30 IST

దళిత బంధు పథకం అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేసిన బీజేపీ

హైదరాబాద్: బీజేపీ లేఖ వలనే దళితబంధు పథకం నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈనెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. దళితబంధు లబ్ధిదారులను గుర్తించినప్పటికీ వాళ్ళ ఖాతాలో కావాలనే నగదు జమ చేయటంలేదని ఆరోపించారు. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు దళితబంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని అధికార పార్టీ  ప్రయత్నాలు చేస్తోందన్నారు. దళితబంధు విషయంలో అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసినా నిధులను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ హోల్డ్ చేశారని ఆ లేఖలో పేర్కొన్నట్లు ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-19T15:14:10+05:30 IST