Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాట్‌ తగ్గించే దాకా పోరాటం

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన

- జిల్లా వ్యాప్తంగా ఎద్దుల బండ్ల ర్యాలీలు

గద్వాల టౌన్‌/ అయిజ/ రాజోలి/ కేటీదొడ్డి/ అలంపూర్‌/ గట్టు, నవంబరు 30 : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్‌ తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో లుపై రూ.5, డీజిల్‌ రూ.10 తగ్గించినా, రాష్ట్ర ప్రభు త్వం వ్యాట్‌ భారం తగ్గించక పోవడం వాహన దారులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇతర రాష్ర్టాల్లో సుంకం తగ్గించినా, తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మొండి వైఖరితో వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో నిర్వహించిన ఎద్దుల బండ్ల ర్యాలీలో డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం వ్యాట్‌ భారం తగ్గించడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలు మన రాష్ట్రం కన్నా రూ.11లు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. రైతు పండించిన ప్రతీ గింజను కొంటామని గతంలో ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌, ఇప్పుడు మాట మార్చి నెపాన్ని కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. మద్యం వ్యాపారం ద్వారా ప్రజల కష్టాన్ని దోచుకుంటున్న ప్రభుత్వానికి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణం లోని గాంధీ చౌక్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారుల గుండా సాగింది. ర్యాలీలో మహిళా మో ర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు, వెంక టేశ్వరరెడ్డి, నాగేంద్రయాదవ్‌, డీటీడీసీ నరసింహ, నెమలికంటి రామాంజి, భాస్కర్‌ యాదవ్‌, తుమ్మల నరసింహులు పాల్గొన్నారు. 


సామాన్యులపై ఆర్థిక భారం

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించకుండా రాష్ట్ర ప్రభుత్వం సామాన్య జనంపై భారం మోపుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అయిజ పట్టణంలోని పాతబస్టాండ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ఎద్దుల బండ్ల తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామచం ద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించకపోతే సామాన్యులు తిరగబడే రోజులు దగ్గర్లో ఉ న్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు బద్రీనాథ్‌, మాదన్న, గోపాలకృష్ణ, ప్రదీప్‌కుమార్‌, వెంకటేష్‌, నరసింహయ్యశెట్టి, శేఖర్‌ పాల్గొన్నారు.


- పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలని కోరుతూ రాజోలిలో ఎద్దులబండ్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మహిళా అధ్యక్షురాలు స్వప్న, మండల నాయకులు పాల్గొన్నారు.


- కేటీదొడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన ఎద్దుల బండ్ల ర్యాలీకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్ర మంలో మండల అధ్యక్షుడు మహానందిరెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు నందిన్నె మహాదేవ్‌, కిసాన్‌ మోర్చ అధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వీరేష్‌, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


- బీజేపీ అలంపూరు ఇన్‌చార్జి అక్కల రమా సాయి బాబా, పట్టణ అధ్యక్షుడు నాగమద్దిలేటి ఆధ్వర్యంలో పట్టణంలో ఎద్దులబండ్లతో ర్యాలీ నిర్వహించారు. కార్య క్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లా, ప్రట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్‌ కుమార్‌, మండల అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి, ఈశ్వరయ్య, తాటి శ్రీధర్‌, వినీత్‌కుమార్‌, శరత్‌బాబు, పరశురామ్‌, మధురవాణి పాల్గొన్నారు.  


- గట్టులో బీజేపీ ఆధ్వర్యంలో ఎద్దుల బండ్ల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అంబాభవానీ ఆలయం నుంచి బస్టాండ్‌ వరకు దాదాపు 20 ఎద్దుల బండ్లతో ర్యాలీ కొనసాగింది. బీజేపీ మండల అధ్యక్షుడు బల్గెర శివారెడ్డి, సీనియర్‌ నాయకుడు మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆందోళనలో బీజేవైఎం అధ్యక్షుడు కే భాస్కర్‌, స్వామి, రాజప్ప, నరసన్న, ముక్కేరయ్య, ఏలియా, శివప్ప పాల్గొన్నారు. 

Advertisement
Advertisement