Abn logo
Sep 20 2021 @ 00:23AM

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే

సమావేశంలో మాట్లాడుతున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 


మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 19: నిర్మల్‌లో చేపట్టిన సభ సక్సెస్‌ అయ్యిందని, ఇదే ఉత్సాహంతో రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునేవరకు కార్రకర్తలు విశ్రమించొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ మెదక్‌ జిల్లా బీజేపీ నాయకత్వానికి దిశా నిర్ధేశం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం మెదక్‌ జిల్లా బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్‌ సభ సక్సె్‌సతో గులాబీ బాస్‌కు గుబులు పట్టుకుందన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు బీజేపీనే ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మెదక్‌ జిల్లాలో ప్రజా సంగ్రాయ యాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి, నందు జనార్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్‌, సంగసాని సురేష్‌, సుధాకర్‌రెడ్డి, కోశాధికారి వెంకటేశం, నందారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్‌, కాశీనాఽథ్‌, మధు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణ తదితరులు పాల్గొన్నారు.