Abn logo
Sep 20 2021 @ 16:54PM

బెంగాల్ నుంచి రాజ్యసభకు బీజేపీ పోటీ చేయదు: సువేందు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు జరిగే ఉపఎన్నిల్లో తమ పార్టీ తరఫున ఎవరినీ అభ్యర్థిగా నిలబెట్టడం లేదని రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ నేత సువేందు అధికారి సోమవారంనాడు ఓ ట్వీట్‌‌లో తెలిపారు. ''బెంగాల్ రాజ్యసభకు ఎవరినీ పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేయడం లేదు. ఫలితం ముందుగానే నిర్ధారణ అయిపోయింది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రిని తిరిగి ఎన్నిక కానీయకుండా చేయడంపైనే మేము దృష్టి సారిస్తున్నాం''అని సువేందు ఆ ట్వీ ట్‌లో పేర్కొన్నారు. కాగా, బెంగాల్‌ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తమ రాజ్యసభ అభ్యర్థిగా ఇటీవలే ఆ పార్టీలో చేరిన సుస్మితా దేవ్‌ను నామినేట్ చేసింది.

భారత ఎన్నికల కమిషన్ ఇటీవల 5 రాష్ట్రాల్లోని 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు ప్రకటించింది. ఆరు రాజ్యసభ స్థానాల్లో రెండు తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్ నుంచి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. అక్టోబర్ 4న ఎన్నికలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండిImage Caption