Abn logo
Sep 19 2020 @ 16:02PM

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈసారి లేనట్టే..!

Kaakateeya

న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు పలువురు కోవిడ్ బారిన పడుతుండటంతో ఈసారి వర్షాకాల సమావేశాలకు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమావేశాలు ముగిసేంతవరకూ రెగ్యులర్‌గా ఎంపీలు, మంత్రులకు కోవిడ్ పరీక్షలు జరపాలని నిర్ణయించారు. సమావేశాలు జరుగుతున్నంత కాలం పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా ఉన్న బీజేపీ సైతం ఇంతవరకూ ఒక్క పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా నిర్వహించలేదు.

పార్లమెంటు సమావేశాల రోజుల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాలను ఉద్దేశించి ప్రధాని తరచు మాట్లాడేవారు. ఎంపీల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు, పార్టీ విధానాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలంటూ ఆదేశించిన సందర్భాలు గతంలో ఈ సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. వారానికి ఒకసారి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరపడం సంప్రదాయంగా ఉండేది. కాగా, ఈ సమావేశాల్లో ఇంతవరకూ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగలేదు. పార్లమెంటరీ పార్టీ సమావేశం అంటే అందరూ ఒక చోట చేరాల్సి ఉంటుందని, ప్రస్తుతం పార్లమెంటులో అమలు చేస్తున్న కోవిడ్-19 ప్రొటోకాల్‌‌కు ఇది విరుద్ధమని బీజేపీ ఎంపీ ఒకరు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు కుదించే అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలు వెలువడుతున్నట్టు చెప్పారు.

మరోవైపు, కోవిడ్ నెగిటివ్ వచ్చిన నాలుగు రోజుల్లోనే ఇద్దరు ఎంపీలు (నితిన్ గడ్కరి, వినయ్ సహస్రబుద్ధే) కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. దీంతో ప్రతిరోజూ మంత్రులు, ఎంపీల హెల్త్ అప్‌డేట్స్‌‌ తీసుకుంటున్నారు. సిబ్బందికి ఎంట్రన్స్ మెయిన్ బిల్డింగ్‌లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. డైలీ బేసిస్‌లో పనిచేసే వారికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలకు వారి నివాసంలోనూ, పార్లమెంట్ అనెక్స్‌లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement