Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీజేపీ నిరసనలో అపశ్రుతి

- ఎడ్లబండి పైనుంచి పడి పలువురికి గాయాలు 

సిరిసిల్ల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో   అపశ్రుతి  చోటు చేసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు ఎడ్లబండిపై తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. కార్యాలయానికి సమీపంలో ఎడ్లు బెదిరి పరుగెత్తడంతో బండి పైనుంచి బీజేపీ నాయకులు కింద పడ్డారు.  ఘటనలో బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు కాలు విరిగింది. ఆయనను కరీంనగర్‌ తరలించి చికిత్స చేయిస్తున్నారు. పార్టీ నాయకుడు మేకల కమలాకర్‌ కాళ్లకు గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా బీజేపీ నాయకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు ముస్తాబాద్‌ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఎడ్ల బండిపై నిరసనగా తెలుపగా రుద్రంగిలో ట్రాక్టర్‌ను తాళ్లతో లాగి నిరసన వ్యక్తం చేశారు. గంభీరావుపేట, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వేములవాడలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. 

Advertisement
Advertisement