Abn logo
Sep 10 2021 @ 20:54PM

సెప్టెంబరు 17 నుంచి బీజేపీ సేవా ఔర్‌ సమర్పణ్ అభియాన్

హైదరాబాద్: బీజేపీ ఆధ్యర్యంలో  సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 7 వరకు బీజేపీ సేవా ఔర్‌ సమర్పణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సౌత్ ఇండియా కో-ఇంచార్జ్‌గా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మ వీరపనేనిని నియమించారు. సీఎం, ప్రధానిగా మోదీ ప్రజా ప్రస్థానం ప్రారంభించి 20ఏళ్ళు అయిన సందర్భంగా జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా హెల్తీ ఉమన్, హెల్తీ భారత్ పేరుతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. మోదీ జన్మదినం సెప్టెంబరు 17నుంచి అక్టోబర్ 7వరకు 20రోజుల పాటు దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేస్తారు.