Abn logo
May 28 2020 @ 16:19PM

సంబిత్ పాత్రకు కరోనా లక్షణాలు.. ఆస్పత్రిలో చేరిక...

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఇవాళ గుర్గాన్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స కోసం ఆయన చేరినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించాయి. పలు టీవీ చానెళ్లలో బీజేపీ తరపున ప్రముఖంగా వినిపించే గొంతు సంబిత్ పాత్ర అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అత్యంత చురుగ్గా కనిపించే ఆయన.. నిన్న కూడా ట్విటర్లో పలు పోస్టులు పెట్టారు. 

Advertisement
Advertisement
Advertisement