బీజేపీ రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలు

ABN , First Publish Date - 2021-11-28T02:28:51+05:30 IST

నగరంలో జరగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలు

హైదరాబాద్: నగరంలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఐదు తీర్మానాలను రాష్ట్ర కార్యవర్గం ఆమోదించింది. రాజకీయం, రైతుసమస్యలు, దళితబంధు, ధరణి, నిరుద్యోగంపై తీర్మానాలు చేశారు. హుజురాబాద్ ఫలితం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం పేర్కొంది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్, అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులను పెంచాలని డిమాండ్ చేసింది. మైనింగ్‌ను టీఆర్ఎస్ మాఫియా తమ చేతుల్లోకి తీసుకుందన్నారు. సీఎం కేసీఆర్ దళిత ద్రోహిగా మారారని తీర్మానించింది. ధరణి పేరుతో టీఆర్ఎస్ నేతలు భూ దందాలకు పాల్పడుతున్నారని బీజేపీ కార్యవర్గం పేర్కొంది. సీఎం కుటుంబమే భూ మార్పుల కోసం లంచాలు డిమాండ్ చేస్తోందని బీజేపీ కార్యవర్గం తెలిపింది. 




Updated Date - 2021-11-28T02:28:51+05:30 IST