టీఆర్‌ఎస్‌పై రాజీలేని పోరాటం

ABN , First Publish Date - 2020-10-13T10:05:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ రాజీలేని పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ

టీఆర్‌ఎస్‌పై రాజీలేని పోరాటం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుకూల చట్టాల కోసమే ప్రత్యేక అసెంబ్లీ : బండి సంజయ్‌


హైదరాబాద్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ రాజీలేని పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానించింది. ప్రభుత్వ విధానాల పట్ల విసుగు చెందిన దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు టీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు ఉత్సాహంగా ఉన్నారని, బీజేపీ విజయావకాశాలు మెరుగుపడ్డాయని అభిప్రాయపడింది. పార్టీ అభ్యర్థి రఘునందన్‌కు మద్దతు గా నియోజకవర్గంలో ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించింది. సోమవారం నాంపల్లి రాష్ట్రపార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర నూతన పదాధికారుల సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.  సమావేశంలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎ న్నికలు, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భం గా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలపై ప్రధానంగా చర్చించారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి చట్టాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా శాసనసభ సమావేశాలు నిర్వహిస్తోందని బీజేపీ విమర్శించింది. మైనారిటీ రిజర్వేషన్లతో కలిపికాకుండా, కేవలం గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని మాత్ర మే కేంద్రానికి పంపించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించిం ది. కాగా, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ వరంగల్‌లో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. హిందువు అనే పదం పలకడానికే సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. మైనారి టీ సంతుష్టీకరణ విధానాలు అవలంబిస్తూ, హిందూ సమాజాన్ని చీల్చేందుకు ఆయన కుట్రపన్నారని ఆరోపించారు. సోమవారం శివసేన రాష్ట్ర అధ్యక్షుడు మురారి బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ  ఏ పార్టీ అయినా తమ కాళ్లవద్దే బతకాలంటూ ఎం ఐ ఎం నాయకులు ప్రకటిస్తే, దానిని ఖండించలేని దుస్థితి టీఆర్‌ఎ్‌సది అని అన్నారు. కాగా,  ఉ ద్యోగులకు వరాలు ప్రకటించిన  నిర్మల సీతారామన్‌కు బండి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-10-13T10:05:45+05:30 IST