Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 28 2021 @ 07:45AM

bsp:రామాలయం విరాళాలను బీజేపీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోంది...

బీఎస్పీ నేత సంచలన ఆరోపణ

లక్నో: బీజేపీ పార్టీ రాముడిని మోసం చేస్తుందని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా ఆరోపించారు. అయోధ్యలోని రామాలయం నిర్మాణం కోసం సేకరించిన విరాళాలను బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తుందని మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు.రామాలయం నిర్మాణానికి పునాది ఇప్పటివరకు నిర్మించలేదని, ఆలయం ఏ సమయంలో పూర్తి అవుతుందో అధికార బీజేపీ పార్టీ చెప్పలేక పోతుందని మిశ్రా చెప్పారు. ‘‘రామాలయం కోసం సేకరించిన విరాళాలను ఉపయోగించి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది, ఆలయ విరాళాలను ఉపయోగించి బీజేపీ 500 ఎన్నికల రథాలను సిద్ధం చేసింది’’ అని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు మిశ్రా పేర్కొన్నారు.

యూపీలో 23 శాతం ఉన్న దళితులు, 13 శాతం ఉన్న బ్రాహ్మణులు కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరారు.యూపీలో బీఎస్పీ హయాంలో బ్రాహ్మణులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించామని,2007వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 మంది బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చామని ఆయన చెప్పారు. వారిలో 45 మంది ఎన్నికల్లో గెలవగా పలువురిని కేబినెట్ మంత్రులుగా చేశామని మిశ్రా వివరించారు. బీజేపీ పాలనలో బ్రాహ్మణులు,దళితులను వేధించారని బీఎస్పీ నేత ఆరోపించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. 

Advertisement
Advertisement