Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 28 2021 @ 14:35PM

హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్‌ను గద్దె దించటానికే బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా చార్మనార్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృథా అవుతున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి పేరుతో కేసీఆర్ మోసం చేశారని, బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Advertisement
Advertisement