సాగు చట్టాల రద్దుకు తొందరపడుతున్న బీజేపీ

ABN , First Publish Date - 2021-11-26T02:38:18+05:30 IST

నవంబర్ 19వ తేదీన రైతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా వీలైనంత తొందరలో సాగు చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి..

సాగు చట్టాల రద్దుకు తొందరపడుతున్న బీజేపీ

న్యూఢిల్లీ: నవంబర్ 19వ తేదీన రైతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా వీలైనంత తొందరలో సాగు చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల తొలిరోజునే తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులంతా హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది. సాగు చట్టాల రద్దును పార్లమెంట్‌లో తొందరగా ఆమోదం పొందేలా చూసి రాష్ట్రపతి సంతకం కూడా ముగిసిపోతే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సాగు చట్టాల ప్రస్తావన లేకుండా చూసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.


‘‘సోమవారం ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల మొదటి రోజునే రాజ్యసభకు చెందిన బీజేపీ సభ్యులందరూ హాజరు కావాలి. ఆరోజునే సభలో ముఖ్యమైన అంశాలపై చర్చతో పాటు ఇతర పనులు ఉన్నాయి. సోమవారం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉండి, ప్రభుత్వ వాదనను గెలిపించేందుకు ప్రతి బీజేపీ ఎంపీ సోమవారం రాజ్యసభకు తప్పకుండా హాజరు కావాలి’’ అని రాజ్యసభ బీజేపీ విప్ శివ్ ప్రసాద్ శుక్లా తెలిపారు.

Updated Date - 2021-11-26T02:38:18+05:30 IST