భౌతిక దాడులతో బీజేపీని అడ్డుకోలేరు

ABN , First Publish Date - 2022-01-28T05:57:15+05:30 IST

భౌతిక దాడులతో బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేరని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడికి నిరసనగా గురువారం చేర్యాల తహసీల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు.

భౌతిక దాడులతో బీజేపీని అడ్డుకోలేరు
చేర్యాల తహసీల్దార్‌ కార్యాలయ ఎదుట ఆందోళన చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ నాయకులు

బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి


చేర్యాల, జనవరి 27 : భౌతిక దాడులతో బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేరని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడికి నిరసనగా గురువారం చేర్యాల తహసీల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నాడని ఆరోపించారు. దాడులకు బీజేపీ బెదరదని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేశ్‌, రాష్ట్ర నాయకుడు శశిధర్‌రెడి ్డ, సంజీవరెడ్డి, మహిళామోర్చ నాయకురాలు ఉమారాణి, నాయకులు మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, విజయ, వినోద్‌కుమార్‌, బాలరాజు, చంద్రమౌళి, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, లక్ష్మీపతి, సత్యవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కొమురవెల్లి మండల కేద్రంలో ప్రధాన రహదారిపై గురువారం బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌, రాజు, కొంతం రాజు, బాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, శివ, మధు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.


హుస్నాబాద్‌లో ధర్నా..

హుస్నాబాద్‌, జనవరి 27 : నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడిని నిరసనగా గురువారం హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీలకే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్‌బాబు, నాయకులు శ్రీనివాస్‌, విజయలక్ష్మి, వీరాచారి, రవీందర్‌, జైపాల్‌రెడ్డి, సాగర్‌, అరుణ్‌, వెంకటేశ్వర్లు, సంతో్‌ష,యాదగిరి, కిష్టయ్య, మహేందర్‌, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం 

బెజ్జంకి, జనవరి 27: మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీజేపీ నాయకులు రాష్ట్రప్రభుత్వం, హోంమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దోనే అశోక్‌, ప్రధాన కార్యదర్శి  అనిల్‌రావు, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, గైనీ రాజు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు  సత్యనారాయణ, టౌన్‌ ప్రెసిడెంట్‌ రవి, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వరుణ్‌రావు, రమేష్‌ పాల్గొన్నారు.


నల్ల బ్యాడ్జీలతో నిరసన

నంగునూరు, జనవరి 27: ఎంపీ అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడికి నిరసనగా గురువారం నంగునూరులో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ  బలపడటాన్ని ఓర్వలేకనే దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు యాదమల్లు, నారాయణ, సురేందర్‌, సత్యం, రాజలింగం, రమేష్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


గూండాల్లా  దాడి చేశారు

నారాయణరావుపేట, జనవరి 27 : తన నియోజకవర్గంలో పర్యటించేందుంకు వెళ్తుండగా ఎంపీ ధర్మపురి ఆరవింద్‌పై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, టీఆర్‌ఎస్‌ నాయకులు గూండాల్లా వ్యవహరించారని బీజేపీ మండల అధ్యక్షుడు రాజేశం పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రక్షణ కల్పించాల్సిన పోలీసులే దాడికి సహకారించడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ అరాచకాలకు చరమగీతం పాడుతారని స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-28T05:57:15+05:30 IST