బీజేపీలో ‘యోగి’ గుబులు!

ABN , First Publish Date - 2021-06-02T09:24:26+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ రాజకీయం గా ప్రమాద ఘంటికలను ఊహిస్తోంది. కొవిడ్‌ ని యంత్రణలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై...

బీజేపీలో ‘యోగి’ గుబులు!

  • ఆదిత్యనాథ్‌ పనితీరుపై ప్రజలు, పార్టీలో అసంతృప్తి!!
  • కొవిడ్‌ నియంత్రణ తీరుపై పెదవివిరుపు
  • నష్టనివారణ యత్నాల్లో కేంద్ర నాయకత్వం

లఖ్‌నవూ, జూన్‌ 1: ఉత్తరప్రదేశ్‌ బీజేపీ రాజకీయం గా ప్రమాద ఘంటికలను ఊహిస్తోంది. కొవిడ్‌ ని యంత్రణలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెల్లుబుకుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి ఈ రాష్ట్రమే కీలకం కావడం.. వచ్చే ఏడా ది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడం.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదె బ్బ తగలడం తదితర పరిణామాల నేపథ్యంలో బీజే పీ జాతీయ నాయకత్వం నష్ట నివారణకు ప్రయత్నా లు మొదలుపెట్టింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్రానికి పంపింది. సోమవారం లఖ్‌నవూ వచ్చిన వీరు.. పార్టీ నేతలతో రెండ్రోజులపాటు విస్తృతంగా చర్చించారు. కొవిడ్‌ నియంత్రణ చర్యల తో పాటు యోగి నాయకత్వం తీరుపై రగులుతున్న అసంతృప్తిని తెలుసుకున్నారు. మంగళవారం వారు యోగితో పాటు ఉపముఖ్యమంత్రులు కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మలతోనూ భేటీ అయ్యారు. దీంతో ఎన్నికల ముంగిట సీఎంను మార్చనున్నారన్న వార్త లు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. బీజేపీ వీటిని ఖండించింది. 


ప్రమాద ఘంటికలే..!

నాయకత్వ మార్పు వార్తలను బీజేపీ ఖండించినా.. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌లో అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి.కరోనాతోచనిపోయినవారి మృత దేహాలను గంగానదిలో పారవేయడం, భౌతిక కాయా లను లోతులేని గోతుల్లో ఖననం చేయడంపై  పెద్దఎత్తున వార్తలు వస్తున్నా... యోగి ఏమీ పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

Updated Date - 2021-06-02T09:24:26+05:30 IST