బీజేపీ, వైసీపీ డ్రామా పార్టీలు

ABN , First Publish Date - 2020-09-25T11:19:01+05:30 IST

బీజేపీ, వైసీపీ డ్రామా పార్టీలు

బీజేపీ, వైసీపీ డ్రామా పార్టీలు

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి


వేంపల్లె, సెప్టెంబరు 24: బీజేపీ, వైసీపీ డ్రామా పార్టీలని, ఆ పార్టీలకు వేంకటేశ్వరస్వామిపై నమ్మకంగానీ, భక్తిగానీ, గౌరవం గానీ లేవని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన వేంపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతి బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందన్నారు. టీటీడీ రూల్‌ బుక్కులో రూల్‌ 136 ప్రకారం హిందూ మతానికి చెందని వారు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే తనకు స్వామివారిపై భక్తి, నమ్మకం, గౌరవం ఉన్నాయని డిక్లరేషన్‌ పత్రంపై రాసి సంతకం పెట్టాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సంతకం పెట్ట లేదంటే ఆయనకు స్వామివారిపై భక్తి, నమ్మకం లేనట్లే అన్నారు.


అలాంటప్పుడు నుదుటన తిరునామం దిద్ది, తలకు పరివట్టం చుట్టుకుని మెడలో శేషవస్త్రం ధరించి, తలపై పట్టు వస్త్రాలను తీసుకెళ్లి మూలమూర్తికి సమర్పించడమెందుకు, ఇది డ్రామా కాదా? అని ప్రశ్నించారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని చేత ప్రధానమంత్రిపై విమర్శలు చేయిస్తూ, మరొకవైపు నానీ వ్యాఖ్యలను వైసీపీ ముఖ్యనేత సజ్జల తప్పు పట్టడం డ్రామా కాదా అని ప్రశ్నించారు. గోటితో గిల్లడం - నోటితో జోలపాడడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కార్యక్రమంలో ధ్రువకుమార్‌రెడ్డి, సుబ్బరాయుడు, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T11:19:01+05:30 IST