బోనకల్, జనవరి 16: బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా బోనకల్‌కు చెందిన కారంగుల మురళీకృష్ణ నియమితులయ్యారు. బోనకల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ పట్ల అంకితబావంతో పని చేసినందుకు తనకు తగిన గుర్తింపును ఇచ్చిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.