బెంగళూరులో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-08T16:36:40+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల పరంపర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 48,781మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 21, 376 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఇప్పటివరకు

బెంగళూరులో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

- రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 592 మంది మృత్యువాత 

- లాక్‌డౌన్‌తోనైనా కేసులు తగ్గుముఖం పట్టేనా..?


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల పరంపర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 48,781మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 21, 376 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఇప్పటివరకు నగరంలో బాధితుల సంఖ్య 9లక్షలు అధిగమించింది. తుమకూరులో 3,040మంది, హాసన్‌లో 2422, మైసూరు 2246, కలబుర్గి 1722, దక్షిణకన్నడ 1633, బళ్ళారి 1284, మండ్య 1110, బెళగావి 965, బెంగళూరు గ్రామీణ 959, ధార్వాడ 942, ఉ డుపి 976 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో 18.38లక్షలమంది కొవిడ్‌ బాధితులయ్యారు. కోలుకునేవారు ఆశాజనం అనిపించా రు. 28,623 మంది తాజాగా కోలుకోగా ఇప్పటివరకు 12.84లక్షలమంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 592మంది ఒకేరోజు మృతి చెందడం ఇటు అధికారులను, అటు బాధితులను కుదిపేసింది. బెంగళూరులో 346మంది, బళ్ళారిలో 24, మైసూరు 22, హాసన్‌ 20, కలబుర్గి 19, తుమకూరు 15మంది మృతి చెందగా మిగిలిన జిల్లాలో అంతకులోపు మృతులు నమోదయ్యారు. రాష్ట్రంలో 5,36,646మంది చికిత్సలు పొందుతున్నారు. వీరిలో 3,41,978మంది బెంగళూరులోనే ఉన్నారు. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలుకు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుటి నుంచైనా కరోనా తగ్గుముఖం పట్టేనా లేదా అన్నది చర్చనీయాంశమయ్యింది. కరోనా కర్ఫ్యూలో జనం ఉదయం 10 గంటల వరకు విచ్చల విడిగా తిరగడం, మందులు, నిత్యావసరాల పేరుతో బయటికి రావడం కారణంగా కరోనాకు కళ్లెం వేయలేకపోయామన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇలాంటి వేళ సంపూర్ణ లాక్‌డౌన్‌పేనే అందరి దృష్ఠి నెలకొందని చెప్పవచ్చు.

Updated Date - 2021-05-08T16:36:40+05:30 IST