Abn logo
Jun 11 2021 @ 20:28PM

ఏపీలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ కేసులు: అనిల్‌ సింఘాల్‌

అమరావతి: ఏపీలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ కేసులున్నామని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ వల్ల ఏపీలో 138 మంది మృతి చెందారని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో కరోనా కేసులు తగ్గాయని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వారిలో 53 శాతం వ్యాక్సినేషన్ వేశామని అనిల్‌ సింఘాల్‌ చెప్పారు.

Advertisement