మహారాష్ట్రలో 7,295 బ్లాక్ ఫంగస్ కేసులు

ABN , First Publish Date - 2021-06-14T10:58:42+05:30 IST

మహారాష్ట్రలో 7,395 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనాయి.

మహారాష్ట్రలో 7,295 బ్లాక్ ఫంగస్ కేసులు

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలో 7,395 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ మహమ్మారి అనంతరం మహారాష్ట్రలో ప్రబలిన బ్లాక్ ఫంగస్ వల్ల 644 మంది మరణించారు. 2,212 మంది ఫంగస్ బారి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలోని పూణే, నాగపూర్, నాసిక్, షోలాపూర్ జిల్లాల్లో బ్లాక్ ఫంగస్  కేసులు ఎక్కువగా వెలుగుచూశాయి. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్ణీత ధరలను సర్కారు నిర్ణయించింది. కరోనా నుంచి కోలుకున్న మధుమేహవ్యాధిగ్రస్థుల్లో ఈ ఫంగస్ సోకుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్రతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్, పంజాబ్, హర్యానా, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రబలటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చికిత్స అందిస్తున్నాయి. 

Updated Date - 2021-06-14T10:58:42+05:30 IST