జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

ABN , First Publish Date - 2021-05-18T07:04:19+05:30 IST

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేగింది. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ కూలీ(56) బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో సోమవారం మృతిచెందటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరెగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీకి గత నెలలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా; హోం ఐసొలేషన్‌లో ఉన్నాడు. వైద్యులు సూచించిన మందులు వాడటంతో కరోనా నెగెటివ్‌ వచ్చింది.

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

 గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి 

మృతికి కారణం చెప్పలేదంటున్న కుటుంబీకులు


చిట్యాలరూరల్‌, మే 17: జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేగింది. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ కూలీ(56) బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో సోమవారం మృతిచెందటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరెగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీకి గత నెలలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా; హోం ఐసొలేషన్‌లో ఉన్నాడు. వైద్యులు సూచించిన మందులు వాడటంతో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ నెల 13వ తేదీన కన్ను ఎర్రగా కావడం, మూతి వంకర పోవడంతో నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం ఆరెగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతికి గల కారణాలు వైద్యులు తమకు చెప్పలేదని మృతుడి కుటుంబీకులు తెలిపారు.

Updated Date - 2021-05-18T07:04:19+05:30 IST