బ్లాక్‌ ఫంగస్‌ శస్త్రచికిత్సతో బాలుడికి సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-16T06:18:09+05:30 IST

మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) వ్యాధి సోకిన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెంది న 15 నెలల బాలుడు జానకీనందన్‌కి జీజీహెచ్‌ వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా చేసి, పూర్తి ఆరోగ్యంగా కోలుకునేలా చేసి అసమాన నైపుణ్యాన్ని చాటుకున్నారని అసిస్టెంట్‌ కలెక్టర్‌, ప్రత్యేక నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చంద్‌ కితాబిచ్చారు.

బ్లాక్‌ ఫంగస్‌ శస్త్రచికిత్సతో బాలుడికి సంపూర్ణ ఆరోగ్యం
సమావేశంలో మాట్లాడుతున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మి

జీజీహెచ్‌ (కాకినాడ), జూన్‌ 15: మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) వ్యాధి సోకిన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెంది న 15 నెలల బాలుడు జానకీనందన్‌కి జీజీహెచ్‌ వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా చేసి, పూర్తి ఆరోగ్యంగా కోలుకునేలా చేసి అసమాన నైపుణ్యాన్ని చాటుకున్నారని అసిస్టెంట్‌ కలెక్టర్‌, ప్రత్యేక నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చంద్‌ కితాబిచ్చారు. మంగళవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌ మహాలక్ష్మి ఆధ్వర్యంలో బ్లాక్‌ ఫంగస్‌ నుంచి కోలుకున్న బాలుడు జానకీనందన్‌కి డిశ్చార్జి చేసి తల్లిదండ్రులకు ఆరోగ్యంగా అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే అతిపిన్న వయసు గల బాలుడికి శస్త్రచికిత్స చేసిన ఘనత జీజీహెచ్‌కే దక్కిందన్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను వైద్యుల సమష్టి కృషి ఫలితంగా విజయవం తమైందన్నారు. ఉత్తమ వైద్యసేవలందిస్తున్న సందర్భంగా సూపరింటెండెంట్‌, ఎనస్థీషియా, పీడియాట్రిక్‌, ఈఎన్‌టీ విభాగాధిపతులు డాక్టర్లు ఎంఎస్‌రాజు, కృష్ణప్రసాద్‌, డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ రాంబాబు, డాక్టర్‌ కృష్ణ కిషోర్‌, డాక్టర్‌ యు.సుధీర్‌, పలువురు డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని అభినందించారు. 





Updated Date - 2021-06-16T06:18:09+05:30 IST