Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 16 2021 @ 10:11AM

రాయపూర్ రైల్వే స్టేషనులో Blast...ఆరుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు

రాయపూర్ : రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రైలు బోగీలో జరిగిన పేలుడులో ఆరుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బంది గాయపడ్డారు.సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 211 బెటాలియన్ జవాన్లు ప్రత్యేక రైలులో జమ్మూ వెళుతుండగా డమ్మీ క్యాట్రిడ్జ్ బాక్స్‌లో ఉంచిన గ్రెనేడ్ రైలు బోగీలో ఉంచగానే పేలింది.ఈ పేలుడులో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. తీవ్రమైన గాయాల కారణంగా ఒక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు.ఈ పేలుడు ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement