Aug 2 2021 @ 05:00AM

బర్త్‌డేకి బ్లాస్టర్‌

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. వచ్చే ఏడాది జనవరి 13న, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ వెల్లడించాయి. అలాగే, సినిమాలో మహేశ్‌బాబు ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. కారులో స్టయిలిష్‌గా ఉన్న లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9న ‘బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో చిన్న వీడియో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.