అనమనమూరువాసుల గుండెల్లో ‘బ్లాస్టింగ్‌’ !

ABN , First Publish Date - 2021-09-29T06:01:28+05:30 IST

జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టు సంస్థ మేదరమెట్ల కొండవద్ద చేపడుతున్న బ్లాస్టింగ్‌లతో సమీపంలోని అనమనమూరు పునరావాస కాలనీ వాసులకు కంటి మీద కునుకు కరు వైంది. మెటల్‌ రాయి కోసం రాత్రి వేళల్లోనూ భారీ పేలుళ్లు చేస్తుండటంతో భూమి సైతం కంపిస్తోంది. పలు ఇళ్లు బీట లు వారాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కాల నీవాసులు వణికిపోతున్నారు.

అనమనమూరువాసుల గుండెల్లో ‘బ్లాస్టింగ్‌’ !
బ్లాస్టింగ్‌ల ధాటికి బీటలు వచ్చిన ప్రహరీలు, పునాదులు

మేదరమెట్ల కొండ వద్ద విచ్చలవిడిగా పేలుళ్లు

మెటల్‌ రాయి కోసం రాత్రుళ్లూ కొనసాగింపు 

ఇళ్లకు బీటలు..ఆందోళనలో గ్రామస్థులు 

వెంటనే ఆపించాలని డీటీకి వినతి


మేదరమెట్ల, సెప్టెంబరు 28 : జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టు సంస్థ మేదరమెట్ల కొండవద్ద చేపడుతున్న బ్లాస్టింగ్‌లతో సమీపంలోని అనమనమూరు పునరావాస కాలనీ వాసులకు కంటి మీద కునుకు కరు వైంది. మెటల్‌ రాయి కోసం రాత్రి వేళల్లోనూ భారీ పేలుళ్లు  చేస్తుండటంతో భూమి సైతం కంపిస్తోంది. పలు ఇళ్లు బీట లు వారాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కాల నీవాసులు వణికిపోతున్నారు. మేదరమెట్ల కొండ వద్ద పది సంవత్సరాలుగా బీఎస్‌సీపీఎల్‌ సంస్థ బ్లాస్టింగ్‌లు చేస్తోం ది. వచ్చిన మెటల్‌ను రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తోంది. మన జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోని రోడ్ల నిర్మాణానికి కూ డా ఇక్కడి నుంచే మెటల్‌ను తరలిస్తోంది. గతంతో కొం తమంది కోర్టుకు వెళ్ళి బ్లాస్టింగ్‌ను నిలిపివేయించారు. ఆతర్వాత ముడిపదార్థా ల తక్కువ మోతాదులో వాడుకుంటూ బ్లాస్టింగ్‌ చేసుకుంటూ వస్తున్నా రు. దీంతో ఎటువంటి ఇ బ్బందులు తలెత్తలేదు. ఇటీవల మళ్లీ  బ్లాస్టింగ్‌ల మోతాదును పెంచారు. దీంతో భూమి కంపిస్తోంది. గృహాలు నెర్రెలు కొడుతున్నాయి. రా త్రిళ్లు కూడా పేలుళ్లను కొనసాగిస్తుండటంతో ఇళ్లలో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. 


డిప్యూటీ తహసీల్దార్‌ ఎదుట గోడు


బ్లాస్టింగ్‌ల భయంతో వణికిపోతున్న అనమనమూరు పునరావాసకాలనీ వాసులు మంగళవారం కొరిశపాడు డి ప్యూటీ తహసీల్దార్‌ మెహతాజ్‌ను కలిసి తమ గోడు వెళ్ల బోసుకున్నారు. అసలే గుండ్లకమమ్మ రిజర్వాయర్‌ నిర్మా ణంలో భాగంగా ముంపు గ్రామమైన అనమనమూరు నుంచి ఇక్కడకు వచ్చి ప్రభుత్వం మంజూరు చేసిన లే అవుట్‌లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నామని తెలిపారు. ప్ర స్తుతం మేదరమెట్ల కొండపై జరుగుతున్న భారీ బ్లాస్టింగ్‌ల వల్ల కట్టుకున్న ఇళ్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని వా పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము మళ్లీ ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతులకు మించి బ్లాస్టింగ్‌ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరా రు. అక్రమ బ్లాస్టింగ్‌ను నిలిపివేయించి, దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-09-29T06:01:28+05:30 IST