Abn logo
Sep 19 2021 @ 01:01AM

పంచాయతీలకు బ్లీచింగ్‌, సున్నం సరఫరా

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యే చొరవ

కందుకూరు, సెప్టెంబరు 18 : సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు పరిసరాల పరిశుభ్రత ఎంతో ఆవశ్యకతమైనది. బ్లీచింగ్‌, సున్నం చల్లడం ద్వారా దోమల వ్యాప్తిని అధికారులు నియంత్రిస్తారు. ప్రస్తుత తరుణంలో పారిశుధ్యం కోసం కందుకూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. పంచాయతీలపై సున్నం బ్లీచింగ్‌ భారం తగ్గించేందుకు ప్రత్యేక చొరవ చూపినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని పంచాయతీలకు అవసరమైన సున్నం, బ్లీచింగ్‌ను నేరుగా రాయలసీమలోని ఫ్యాక్టరీ నుంచినేరుగా కొనుగోలు చేసి సంగం ధరకే అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. బ్లీచింగ్‌ బస్తా రూ.555కి, సున్నం టన్ను 2500 చొప్పున కొనుగోలు చేసి తెప్పించామన్నారు. మొదటి విడతగా 20 టన్నుల బ్లీచింగ్‌, 40 టన్నుల సున్నంకు రమారమి ఐదున్నర లక్షలు ఖర్చు కాగా ఆయనే చెల్లించి తెప్పించి అందజేశారు. ఆ మొత్తాన్ని ఆయా పంచాయతీలు రిఫండ్‌ చేయాలని సూచించారు. కందుకూరు మున్సిపాలిటీకి కూడా ఇదే రీతిలో బ్లీచింగ్‌, సున్నం తెప్పిస్తామని ప్రస్తుతం తీసుకున్న వారికి కూడా ఇంకా అవసరం ఉంటే తెప్పిస్తామని ఎమ్మెల్యే మహీధరరెడ్డి వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరతో పోల్చినా, బహిరంగ మార్కెట్లోని ధరతో పోల్చినా కేవలం ఈరోజు తెప్పించిన బ్లీచింగ్‌, సున్నంలలోనే పంచాయతీలకు 5 లక్షల వరకు ఆదా అయినట్లని అధికారులు వివరించారు.