Abn logo
Nov 21 2020 @ 21:50PM

దాహం తీరలేదంటోన్న ‘బ్లాక్డ్’ టీమ్‌

Kaakateeya

మనోజ్  నందం హీరోగా శ్వేత సాలూరు హీరోయిన్‌గా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో రామారావు లెంక‌, ప‌ద్మ లెంక సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ 'బ్లాక్డ్‌'. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'దాహం తీరనంటోన్నది.. నీ స్నేహం కోరుకుంటున్నది' అనే రొమాంటిక్‌ పాటని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ పాటకి మంచి స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ''రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రేక్షకులను అబ్బురపరిచే సన్నివేశాలు ఎన్నో  ఉంటాయి. అలాగే హార‌ర్ కామెడీ  అంద‌రినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. టీజర్‌కి  మంచి స్పందన లభించింది. ఇప్పటివరకు వచ్చిన హార్రర్ చిత్రాల్లో కంటే మా చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదే మాట ప్రేక్షకులు సినిమా చూసి ముక్తకంటంతో చెపుతారు అనే నమ్మకముంది. ప్రదీప్ చంద్ర మంచి ట్యూన్స్‌తో పాటు రీ-రికార్డింగ్ అత్యద్భుతంగా చేసాడు. దాహం తీరనట్టున్నది పాటని రిలీజ్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.." అని తెలిపారు.


Advertisement
Advertisement