ప్రధానికే ఊహించని ఝలకిచ్చిన బ్లాగర్!

ABN , First Publish Date - 2021-04-05T22:43:06+05:30 IST

కోర్టులో గెలిచిన ప్రధానికి ఊహించని షాకిచ్చిన బ్లాగర్

ప్రధానికే ఊహించని ఝలకిచ్చిన బ్లాగర్!

ఇంటర్నెట్ డెస్క్: నేటి ఇంటర్నెట్ జమానాలో విమర్శలకు పొగడ్తలకు ప్రధాన వేదికలుగా సోషల్ మీడియా, బ్లాగులు అవతరించాయి. ప్రభుత్వ వ్యవస్థలు, వాటికి నేతృత్వం వహిస్తున్న పెద్దలపై అనేక మంది ఈ మాధ్యమాల ద్వారా తీవ్ర విమర్శలు చేస్తుంటారు. అయితే.. ఇవి హద్దుమీరాయని అధికార వర్గాలు భావిస్తే చిక్కుల్లో పడినట్టే. సింగపూర్‌కు చెందిన బ్లాగర్ లియోన్ సీ హీయెన్ సరిగ్గా అటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయన సింగపూర్ ప్రధాని లీ సియోన్ లూంగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. నగదు అక్రమరవాణా అంశంపై అతడు చేసిన వ్యాఖ్యలకు విపరీతమైన ప్రధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీరియస్ అయిన ప్రధాని..హీయెన్‌పై పరువు నష్టం దావా వేశారు. కోర్టు తీర్పు ప్రధానికి అనుకూలంగా రావడంతో హియోన్ ఏకంగా 99 వేల డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అది కట్టలేని పక్షంలో అతడు ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు హియోన్ కత్తిలాంటి ఐడియా వేశాడు. జరిమానా కట్టడానికి ధనసహాయం చేయాలంటూ అతడు నెటిజన్లను అభ్యర్థించాడు. అయితే.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా జరిమానా సొమ్ము సేకరించాలన్న అతడి ప్లాన్ ఫలించింది. 


నిజాలు మాట్లడే వ్యక్తిగా హియోన్‌ సింగపూర్‌లో బాగా పాపులర్ అవడంతో..నెటిజన్లు అతడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కావాల్సిన డబ్బును విరాళాల రూపంలో సమూకూర్చారు. ఈ విషయాన్ని హియోన్ తాజాగా ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. అనుకున్నది సాదించాం.. సింగపూర్ ప్రజలకు ధన్యవాదాలు అంటూ కామెంట్ చేశారు. మీరు చేస్తున్న సాయం కారణంగా వారిని ఎదరించే ధైర్యం వచ్చిందంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.  జరిమానా ద్వారా పశ్చాత్తాపపడతాడుకుని ప్రధాని ఆశిస్తే..హియోన్ మాత్రం ఈ స్టోరికి తనదైన శైలిలో ఊహించని ట్విస్ట్ ఇచ్చి తనదే అంతిమ విజయం అని చెప్పకనే చెప్పారు.

Updated Date - 2021-04-05T22:43:06+05:30 IST