Advertisement
Advertisement
Abn logo
Advertisement

సకాలంలో రక్తదానం చేసిన హిజ్రా ఎస్‌ఐ

                    - అధికారుల ప్రశంస 


చెన్నై: పచ్చకామెర్లతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌కు సకాలంలో రక్తదానం చేసి హిజ్రా ఎస్‌ఐ ప్రీతికా యాసిని ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంది. స్థానిక అన్నాసాలై పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న శంకరవేల్‌ పచ్చకామెర్లతో కీల్పాక్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. ఆయనకు మూడు యూనిట్ల రక్తం అత్యవసరంగా అవసరమైంది. ఆ విషయం తెలుసుకున్న అదే పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న హిజ్రా ప్రీతికా యాసిని ఆస్పత్రికి వెళ్ళి 350 మి.లీ. రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడగలమని, అందరూ సేవాభావంతో రక్తదానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఐ ప్రీతికా యాసిని తన స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు రక్తదానం చేసిన విషయం తెలుసుకుని పోలీసు ఉన్నతాధికారులు ఆమెను ప్రశంసించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement