సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2021-01-27T18:27:07+05:30 IST

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం.. దాన్ని కొనసాగిస్తూ ఈనెల 24న స్థానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సింగపూర్: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం.. దాన్ని కొనసాగిస్తూ ఈనెల 24న స్థానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేశారు. ఈ సేవా కార్యక్రమానికి అత్యద్భుతమైన స్పందన వచ్చిందని తెలుగు సమాజం సభ్యులు వెల్లడించారు. 125 మంది హాజరై రక్తదానం చేసినట్టు వెల్లడించారు. ఆర్0284 కోడ్‌ను ఉపయోగించి ఔత్సాహికులు రక్తదానం చేయొచ్చని కార్యక్రమ నిర్వాహకులు కాశయ్య తెలిపారు. మే డే సందర్భంగా మరోసారి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపట్ల సింగపూర్ తెలుగు సమాజానికి బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్-19 కష్టకాలంలో ముందుకొచ్చి రక్తదానం చేసిన దాతలకు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి, కార్యదర్శి సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది కూడా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-01-27T18:27:07+05:30 IST