Advertisement
Advertisement
Abn logo
Advertisement

తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

విశాఖపట్నం, నవంబరు 27 : నేవీ వారోత్సవాల్లో భాగంగా శనివారం తూర్పు నావికాదళం రక్తదాన శిబిరం నిర్వహించింది. భీమునిపట్నం నేవల్‌స్టేషన్‌లో ఏర్పాటైన ఈ శిబిరాన్ని  నేవల్‌ స్టేషన్‌ కమాండర్‌ నరేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రక్తదానం చేస్తే అనేక మందికి ప్రాణదానం చేసినట్టు అవుతుందన్నారు. ఎన్‌టీఆర్‌  బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది దాతల నుంచి 115 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 


Advertisement
Advertisement