Advertisement
Advertisement
Abn logo
Advertisement

రక్తదానం మహాదానం

- కలెక్టర్‌ రవి

జగిత్యాల అర్బన్‌, నవంబరు 30: రక్తదానమే మహాధానమని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బస్‌ డిపో ఆవరణలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పెల్లి ఆర్టీసీ డిపోలకు చెందిన 65 మంది సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ఇతర శస్త్ర చికిత్సలకు రక్తం అవసరం అవుతుందన్నారు. రక్తం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన రాష్ట్ర గవర్నర్‌, ఆర్టీసీ ఎండీ రక్తదానం కోసం జారీ చేసిన ఆదేశాల మేరకు బ్లడ్‌ బ్యాంక్‌ కార్యక్రమం నిర్వహించడం అభి నందనీయమన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఎటు వంటి ప్రాణ, ఆరోగ్య నష్టం ఉండదని, అపాయంలో ఉన్నవారిని పరోక్షంగా ఆదుకోగలుగుతార న్నారు. రక్తదానం కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని అందించిన ఆర్టీసీని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా కరోనా విపత్కర పరిస్థితు ల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్ర మంలో జిల్లా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, ఆర్టీసీ డీవీయం నాగేశ్వర్‌, జగిత్యాల, కోరుట్ల డిపో మేనేజర్‌లు జగదీష్‌, కృష్ణమోహన్‌, రెడ్‌క్రాస్‌ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement
Advertisement