రక్తదానం ప్రాణదానంతో సమానం

ABN , First Publish Date - 2021-03-03T06:48:19+05:30 IST

రక్తదానం ప్రాణదానంతో సమానమని హ్యూమన్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్‌ మౌలానా షరీఫ్‌ హుస్సేనీ అన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

పామూరు, మార్చి 2: రక్తదానం ప్రాణదానంతో సమానమని హ్యూమన్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్‌ మౌలానా షరీఫ్‌ హుస్సేనీ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ మహిళకు ఆపరేషన్‌ నిమిత్తం స్థానిక సునీత నర్సింగ్‌ హోమ్‌లో చేరారు. ఆమెకు ఎమర్జన్సీగా ఓ పాజిటీవ్‌ రక్తం అవసరమైంది. ఈ విషయం హెచ్‌డబ్యూసీ అధ్యక్షుడి దృష్టికి  వచ్చింది. స్పందించిన అధ్యక్షుడు  అదేగ్రూపు రక్తం ఉన్న రఫీ ద్వారా రోగికి అవసరమైన రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా రోగి బందువులు రఫితో పాటు, హెడబ్ల్యుసీ సభ్యులను అభినందించారు. 

Updated Date - 2021-03-03T06:48:19+05:30 IST