రక్తదానంతో ప్రాణాలను కాపాడండి

ABN , First Publish Date - 2022-01-29T05:27:06+05:30 IST

సమాజసేవలో యువత ముందుండాలని, రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.

రక్తదానంతో ప్రాణాలను కాపాడండి

దివాన్‌చెరువు, జనవరి 28: సమాజసేవలో యువత ముందుండాలని, రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. నన్నయ వర్సిటీలో యూత్‌ రెడ్‌క్రాస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ప్రథమ చికిత్సా శిక్షణా కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. దీనికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  విశ్వవిద్యాలయం సిబ్బంది, విద్యార్థులు 31 మంది రక్తదానం చేశారు. అలాగే 40 మందికి ప్రథమచికిత్సలో శిక్షణను ఇచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ వైడీ రామారావు, కోఆర్డినేటర్‌ పి.రాజశేఖర్‌, డాక్టర్‌ మహాలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ బి.కెజియారాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:27:06+05:30 IST