రష్యాలో కొత్త ఉపద్రవం.. వ్యాక్సీన్లు లేక చేతులెత్తేస్తున్న ఆస్పత్రులు...

ABN , First Publish Date - 2020-06-02T23:48:38+05:30 IST

ఓ వైపు కరోనా కల్లోలంతో అతలాకుతలమవుతున్న రష్యాలో ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ..

రష్యాలో కొత్త ఉపద్రవం.. వ్యాక్సీన్లు లేక చేతులెత్తేస్తున్న ఆస్పత్రులు...

మాస్కో: ఓ వైపు కరోనా కల్లోలంతో అతలాకుతలమవుతున్న రష్యాలో తాజాగా మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో రక్తం పీల్చే పేల వంటి కొత్త కీటకాలు (టిక్స్) స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల అనేక మంది వీటి బారిన పడుతుండడంతో.. వీటి సంఖ్య విపరీతంగా పెరిగినట్టు అధికారులు గుర్తించారు. సైబీరియా ప్రాంతంలో ఈ కీటకాల సంఖ్య సాధారణ స్థాయి కంటే 428 రెట్లు పెరిగినట్టు రష్యా రక్షణ శాఖ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ కీటకాలు కుట్టిన కారణంగా అస్వస్థతకు గురైన వారు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతుండడంతో.. సరిపడా వ్యాక్సీన్లు లేక ఆస్పత్రులు సైతం చేతులెత్తేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2020-06-02T23:48:38+05:30 IST