కువైత్‌లో ఇండియన్ పాస్‌పోర్టు, వీసా సర్వీసులు BLS International చేతికి..

ABN , First Publish Date - 2021-12-23T14:12:55+05:30 IST

కువైత్‌లోని బీఎల్ఎస్ ఇంటర్నెషనల్‌.. కాన్సులర్, పాస్‌పోర్టు, వీసా సర్వీసుల కోసం ఇండియన్ ఎంబసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

కువైత్‌లో ఇండియన్ పాస్‌పోర్టు, వీసా సర్వీసులు BLS International చేతికి..

కువైత్ సిటీ: కువైత్‌లోని బీఎల్ఎస్ ఇంటర్నెషనల్‌.. కాన్సులర్, పాస్‌పోర్టు, వీసా సర్వీసుల కోసం ఇండియన్ ఎంబసీతో ఒప్పందం కుదుర్చుకుంది. 2022 జనవరి నుంచి బీఎల్ఎస్ ఇంటర్నెషనల్‌ ఈ సర్వీసులను ప్రారంభించనుంది. ఇప్పటివరకు కువైత్‌లో ఇండియన్ పాస్‌పోర్టు, వీసా సేవలను సీకేజీఎస్ అందించింది. ఇప్పుడు సీకేజీఎస్ చేతి నుంచి ఈ బాధ్యతలను బీఎల్ఎస్ ఇంటర్నెషనల్‌‌కు అందించింది భారత ఎంబసీ. దీంతో షరాఖ్, ఫహహీల్, జలేబ్ అల్ షువైఖ్‌లలో మూడు కేంద్రాలను తెరిచి కాన్సులర్, పాస్‌పోర్టు, వీసా సర్వీసులను అందించేందుకు బీఎల్ఎస్ రెడీ అవుతోంది. వీటితో పాటు దరఖాస్తుదారులకు కొన్ని ఇతర సేవలు(ఫార్మ్ ఫిలింగ్, ప్రిటింగ్, ఫొటోగ్రఫీ) కూడా అందించనుంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రతి సంవత్సరం సుమారు 2లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ కెనడా, యూఏఈ, రష్యా, సింగపూర్, చైనా, మలేషియా, ఒమన్, ఆస్ట్రియా, పోలాండ్, లిథువేనియా, నార్వే, హాంకాంగ్ వంటి దేశాల్లో దశాబ్ద కాలంగా భారతీయ మిషన్లకు విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-12-23T14:12:55+05:30 IST