ముంబై వాసులకు ఊరట.. బీఎంసీకి 99 వేల కొవిషీల్డ్ డోసులు

ABN , First Publish Date - 2021-04-10T23:40:35+05:30 IST

కరోనా కేసులతో అల్లాడిపోతున్న ముంబై ప్రజలకు ఇది శుభవార్తే. టీకాలు నిండుకోవడంతో 70కి పైగా టీకా కేంద్రాలను

ముంబై వాసులకు ఊరట.. బీఎంసీకి 99 వేల కొవిషీల్డ్ డోసులు

ముంబై: కరోనా కేసులతో అల్లాడిపోతున్న ముంబై ప్రజలకు ఇది శుభవార్తే. టీకాలు నిండుకోవడంతో 70కి పైగా టీకా కేంద్రాలను మూసివేసిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) నేడు 99 వేల కొవిషీల్డ్ టీకా డోసులను అందుకుంది. వీటిని ముంబై వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీకా కేంద్రాలకు పంపిణీ చేయనున్నారు. టీకా డోసుల లేమి కారణంగా నగరంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ అయిన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)ని బీఎంసీ మూసివేసింది.


ఏప్రిల్ 10, 11 తేదీల్లో ప్రభుత్వ కొవిడ్ కేంద్రాల్లో మాత్రమే టీకాను పంపిణీ చేస్తామని, సరిపడా వ్యాక్సిన్ డోసులు వచ్చిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులలోనూ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కొనసాగిస్తామని నిన్న బీఎంసీ పేర్కొంది. ముంబైలో 49 ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలు ఉండగా, 71 ప్రైవేటు కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. రోజుకు 50 వేల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో లేకపోవడంతో 71 ప్రైవేటు కేంద్రాలను నిన్న మూసివేశారు. ఈ నేపథ్యంలో తాజాగా 99వేల కొవిషీల్డ్ కరోనా టీకా డోసులు బీఎంసీ నేడు అందుకుంది. 

Updated Date - 2021-04-10T23:40:35+05:30 IST