మార్కెట్లోకి బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్‌

ABN , First Publish Date - 2020-02-14T06:30:36+05:30 IST

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ మార్కెట్లోకి 530ఐ స్పోర్ట్‌ను తీసుకువచ్చింది. ఈ సెడాన్‌ కారు ధర రూ.55.4 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). 2 లీటర్‌ బీఎస్‌-6 ప్రమాణాలతో...

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్‌

ధర రూ.55.4 లక్షలు 


న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ మార్కెట్లోకి 530ఐ స్పోర్ట్‌ను తీసుకువచ్చింది. ఈ సెడాన్‌ కారు ధర రూ.55.4 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). 2 లీటర్‌ బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన 4 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో ఈ కారును రూపొందించింది. 252 హార్స్‌పవర్‌, 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో తీసుకువచ్చిన ఈ కారు కేవలం 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ప్లాంట్‌లో 530ఐ స్పోర్ట్‌ను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. సరికొత్త టెక్నాలజీలైన బీఎండబ్ల్యూ డిస్‌ప్లే, గెశ్చర్‌ కంట్రోల్‌ వంటి వాటిని ఇందులో పొందుపరిచినట్లు తెలిపింది. 

Updated Date - 2020-02-14T06:30:36+05:30 IST