బీసీసీఐ కీలక నిర్ణయం.. జోహ్రీ రాజీనామా ఆమోదం

ABN , First Publish Date - 2020-07-10T05:07:16+05:30 IST

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) సీఈవో పదవి నుంచి వైదొలిగిన..

బీసీసీఐ కీలక నిర్ణయం.. జోహ్రీ రాజీనామా ఆమోదం

ముంబై: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) సీఈవో పదవి నుంచి వైదొలిగిన రాహుల్ జోహ్రీ రాజీనామాను బీసీసీఐ ఎట్టకేలకు ఆమోదించింది. కొన్ని నెలల క్రితం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2016లో బీసీసీఐకి తొలి సీఈవోగా జోహ్రీ బాధ్యతలు స్వీకరించాడు. గంగూలీ నేతృత్వంలో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడం, సుప్రీం కోర్టు నియమించిన పరిపాలకుల కమిటీ గతేడాది నిష్క్రమించడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు జోహ్రీ గురించి అప్పట్లో వార్తలొచ్చాయి.


అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపేంటంటే.. జోహ్రీ తన రాజీనామా లేఖను గతేడాది డిసెంబర్ 27న బీసీసీఐకి పంపాడు. ఈ మే నెలలో 2021 వరకూ సీఈవోగా కొనసాగమని జోహ్రీకి బీసీసీఐ ఆఫర్ ఇచ్చింది. తాజాగా.. జోహ్రీ గతేడాది డిసెంబర్ 27న ఇచ్చిన రాజీనామా లేఖను బీసీసీఐ గురువారం ఆమోదించింది.



Updated Date - 2020-07-10T05:07:16+05:30 IST