Abn logo
Oct 22 2021 @ 23:25PM

పని ప్రదేశంలో బోర్డులు తప్పనిసరి

మాట్లాడుతున్న డ్వామా పీడీ కూర్మారావు

డ్వామా పీడీ కూర్మారావు

నందిగాం, అక్టోబరు 22: గ్రామాల్లో ఉపాధి హామీపథకం కింద చేపట్టే పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయడం తప్పనిసరని  జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ హనుమంతు కూర్మారావు అన్నారు. శుక్రవారం నందిగాంలో ఉపాధి పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. పలు పంచాయతీల్లో చేపట్టిన పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదని డీఆర్పీలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి పీడీ స్పందిస్తూ.. బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ఉపాధి ఏపీవో ఎం.నాగరాజును ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేపట్టిన ఉపాధి పనుల తనిఖీ వివరాలను ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎన్‌. శ్రీరామ్మూర్తి, వివిధ శాఖల అధికారులు ఎం.రోజారాణి, మురళీకృష్ణ, కె. ఫణీంద్రకుమార్‌,  ఎస్సార్పీ ఆవులయ్య తదితరులు పాల్గొన్నారు.