విస్తరణలో బొబ్బిలికి దక్కని స్థానం

ABN , First Publish Date - 2021-01-17T04:50:31+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా పలు మునిసిపాలిటీలను విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయగా, ఆ జాబితాలో బొబ్బిలికి స్థానం దక్కలేదు.

విస్తరణలో బొబ్బిలికి దక్కని స్థానం

బొబ్బిలి: రాష్ట్ర వ్యాప్తంగా పలు మునిసిపాలిటీలను విస్తరిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులను జారీ చేయగా, ఆ జాబితాలో బొబ్బిలికి స్థానం దక్కలేదు.  సుమారు 70 వేల జనాభాతో ఉన్న బొబ్బిలిని విస్తరించేందుకు గడిచిన 15 ఏళ్ల నుంచి ప్రతిపా దనలున్నాయి. పట్టణాన్ని ఆనుకొని జగన్నాఽథపురం, దిబ్బగుడ్డివలస, లచ్చయ్యపేట, మెట్టవలస, నారాయణప్పవలస, పెంట, గున్నతోటవలస  తదితర గ్రామాలను విలీ నం చేయాలని ప్రతిపాదించారు. అయితే ఎప్పటికప్పుడు ఏ కారణం చేతనో దానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ప్రధానంగా విలీన ప్రతిపాదనకు ఆయా గ్రామస్థులు  సుముఖత వ్యక్తం చేయలేదు. పన్నుల భారంతో పాటు తమ రాజకీయ మనుగడకు విఘాతం ఏర్పడుతుందని ఆయా గ్రామాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన ప్రక్రియలో బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ కేంద్రం గా ఏర్పాటైతే తప్పనిసరిగా కొన్ని గ్రామాలను విలీనం చేయడం అనివార్యమవు తుంది.  అప్పుడు ఆయా గ్రామస్థులు సుముఖంగా ఉంటారని అధికారులు భావిస్తున్నారు.  ఏయే గ్రామాలను విలీనం చేయాలో మునిసిపల్‌ పరిపాలన శాఖకు గతంలో ప్రతిపాదనలు పంపామని కమిష నర్‌ ఎంఎం నాయుడు తెలిపారు. 

 

Updated Date - 2021-01-17T04:50:31+05:30 IST