సింఘు బోర్డర్‌లో ఉసురు తీసుకున్న రైతు

ABN , First Publish Date - 2021-11-10T20:54:32+05:30 IST

కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్న సింఘు సరిహద్దు వద్ద..

సింఘు బోర్డర్‌లో ఉసురు తీసుకున్న రైతు

న్యూఢిల్లీ: కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్న సింఘు సరిహద్దు వద్ద ఒక రైతు ఉసురు తీసుకున్నాడు. అతని మృతదేహం ఒక చెట్టుకు వేలాడుతుండగా బుధవారం ఉదయం కనుగొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.


కాగా, మరణించిన రైతను అమ్రోహ్ జిల్లా పతేగఢ్ సాహిబ్‌లోని రూర్కీ గ్రామస్తుడు గుర్‌ప్రీత్ సింగ్ (45)గా గుర్తించారు. అతను తరచు రైతు ఉద్యమంలో పాల్గొనేవాడని, గత ఐదారు నెలలుగా అక్కడే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. రైతు మృతదేహాన్ని పోస్ట్ మార్గం కోసం పంపారు. అతను హత్య చేసుకున్నాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంటుంది. ఈ రెండు కోణాల నుంచి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని సింఘు, టిక్రి సరిహద్దుల్లో పంజాబ్ రైతులు గత ఏడాది నవంబర్ నుంచి నిరసన దీక్ష సాగిస్తున్నారు.

Updated Date - 2021-11-10T20:54:32+05:30 IST