Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెల్లవారుజామున చలికి వణుక్కుంటూనే పొలానికి వెళ్లాడో రైతు.. ఓ తోటలో కనిపించిన సీన్ చూసి మైండ్‌బ్లాక్

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగానే ఆ రైతు ఉదయాన్నే లేచాడు.  చలి వణికిస్తున్నా వెరవకుండా పొలానికి వెళ్లాడు. అది అతడు నిత్యం చేసే పనే! కానీ ..ఆ రోజు మాత్రం తోటలో కనిపించిన దృశ్యం అతడిని నివ్వెరపోయేలా చేసింది. ఓ యువకుడి మృతదేహం చెట్టుకు వేళాడుతూ కనిపించింది. దీంతో.. ఒక్కసారిగా ఆ రైతుకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అది ఆత్మహత్యా లేక ఎవరైనా అతడిని చంపి ఇక్కడ ఇలా వదలిపెట్టి వెళ్లిపోయారా అనే సందేహాలు అతడికి కలిగాయి.  అయితే..  షాక్ నుంచి వెంటనే తేరుకున్న అతడు గ్రామంలోని వారికి సమాచారం అందించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున కలకలం రేగింది.  బీహార్ రాష్ట్రం పట్నా జిల్లాలోని ధనౌతీ గ్రామంలో గురువారం జరిగిందీ ఘటన. 

గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడి ఫ్యాంటు జేబులో వారికి ఓ ఆధార్ కార్డు కూడా లభ్యమైంది. దాని ఆధారంగా మృతుడిపేరు సచిన్ కుమార్ సింగ్ అని పోలీసులు గుర్తించారు. మరోవైపు సచిన్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడని అతడి సోదరుడు మీడియాతో తెలిపాడు. అయితే..అతడి మానసిక ఆరోగ్యం సరిగా ఉండదని, నిత్యం ఏదో ఒక ఒత్తిడికి గురవుతుంటాడని  అతడి సోదరుడు పేర్కొన్నారు. కాగా.. ఘటనా స్థలానికి అతడి స్వగ్రామం దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో.. అతడు ఆత్మహత్య చేసుకునేందుకు ఇంత దూరం వచ్చి ఉండడని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.  మరోవైపు.. అతడి మెడపై ఉరిపోసుకున్న గుర్తులతో పాటూ కొన్ని నల్లటి చారలు కూడా ఉన్నాయి. దీంతో..గ్రామస్థుల అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే..స్థానిక పోలీసులు ఆ మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. పోస్ట్‌మార్టం నివేదిక తరువాతే..ఏం జరిగిందనేదది తెలుస్తుందని వారు భావిస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement