పదాన్ని కనిపెట్టగలరా?

ABN , First Publish Date - 2020-06-29T05:30:00+05:30 IST

శరీరాన్ని వంచుతూ, తిప్పుతూ ఆడుకునే గేమ్‌ ఇది. ఈ ఆట ఎలా ఆడాలంటే...

పదాన్ని కనిపెట్టగలరా?

శరీరాన్ని వంచుతూ, తిప్పుతూ ఆడుకునే గేమ్‌ ఇది. ఈ ఆట ఎలా ఆడాలంటే...


  1. ఆట ఆడేవాళ్లు రెండు టీమ్‌లుగా ఏర్పడాలి. ఒక్కో టీమ్‌లో నలుగురు ఉండాలి.
  2. ఆట ప్రారంభించే ముందు పదాలను ఎలా చెప్పాలో కొన్ని ప్రత్యేక నియమాలు పెట్టుకోవాలి.
  3. చేతులు, వేళ్లు లేదా మొత్తం శరీరాన్ని ఉపయోగించి చెప్పాలా అనేది ముందే నిర్ణయించుకోవాలి.
  4. పదం నాలుగు అక్షరాలకు మించి ఉండకూడదు. సమయం ఒక నిమిషం పెట్టుకోవాలి.
  5. ఆ పదం ఏంటో శరీరాన్ని వంచుతూ ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వీరి శరీర భంగిమను చూసి పదాన్ని కనిపెట్టగలగాలి.
  6. సమయం లోపల పదం ఏంటో సరిగ్గా చెబితే ఒక పాయింట్‌ వస్తుంది. ఎవరికి ఎక్కువ పాయింట్స్‌ లభిస్తే వారు గెలిచినట్టు!

Updated Date - 2020-06-29T05:30:00+05:30 IST