బీఓఐ లాభం రూ.720 కోట్లు

ABN , First Publish Date - 2021-08-04T08:11:07+05:30 IST

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.720 కోట్ల నికర లాభం ఆర్జించింది.

బీఓఐ లాభం రూ.720 కోట్లు

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  (బీఓఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.720 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆర్జించిన రూ.843.60 కోట్లతో పోల్చితే లాభం 14.7 శాతం తగ్గింది. ఆదాయం కూడా గత ఏడాదితో పోల్చితే రూ.11,941.52 కోట్ల నుంచి రూ.11,698.13 కోట్లకు క్షీణించింది. స్థూల ఎన్‌పీఏలు 13.51 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.35 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలకు రూ.1,709.12 కోట్ల కేటాయింపులు చేసింది బ్యాంక్‌ కన్సాలిడేటెడ్‌ లాభం కూడా 13 శాతం క్షీణించి రూ.845.78 కోట్ల నుంచి రూ.735.37 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం తగ్గడంతో పాటు కేటాయింపులు పెరగడం లాభాలు క్షీణించడానికి కారణమని బీఓఐ సీఈఓ ఏకే దాస్‌ తెలిపారు. దేశీయంగా ఇచ్చిన రుణాలు 1.65 శాతం వృద్ధితో రూ.3,65,653 కోట్లకు చేరగా సేకరించిన డిపాజిట్లు 6.71 శాతం పెరిగి రూ.5,52,303 కోట్లకు చేరాయి.  

Updated Date - 2021-08-04T08:11:07+05:30 IST