బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముందడుగు

ABN , First Publish Date - 2021-01-17T20:09:51+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముందగుడు వేశారు. ఈ కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముందడుగు

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముందగుడు వేశారు. ఈ కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌ కేసులో ఇప్పటి వరకు 19 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో 9 మంది కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్ కోసం గాలిస్తున్నారు. వీరితో పాటుగా మాదాల శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ2గా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు ప్రధాన నిందితురాలిగా మార్చారు. ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు. ముందుగా అఖిలప్రియపై 448,419,341,342,506,366,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత మరో రెండు సెక్షన్లు (ఐపీసీ 147, 385) జోడించారు. ఈ కేసులో అఖిలప్రియను అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో భాగంగా ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు విచారించారు. ఈ కేసులో మరో ముగ్గురిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా గత సోమవారం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోయసంతోష్, మల్లిఖార్జునరెడ్డి, డ్రైవర్ చెన్నయ్యలను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 18న విచారణ జరుపనున్నారు.

Updated Date - 2021-01-17T20:09:51+05:30 IST